విద్యుత్ లైన్ మరమ్మత్తులు చేస్తు ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
పొదిలి మండలంలోని కంభాలపాడు గ్రామం లో నూతనంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలకు నూతన విద్యుత్ లైన్ వేస్తున్న కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం నాడు చోటు చేసుకుంది.
స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దార వీడు వీడు మండలానికి చెందిన ఆంజనేయులు( 28)విద్యుత్ మరమ్మతులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడని పని నిమిత్తం శనివారం నాడు కంభాలపాడు గ్రామం లో ని జగనన్న కాలనీ విద్యుత్ లైన్ కోసం వచ్చి కరెంటు పొల్ ఎక్కి మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా కింద పడి స్దానికులు వైద్యశాల కు తరలిస్తుండగా మృతి చెంది నట్లు తెలిపారు.