మండల స్థాయి క్యారమ్, క్విజ్ పోటీలు ప్రారంభం.

పొదిలి పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు మండల స్థాయి క్యారమ్ ,క్విజ్ పోటీలను ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మావతి లాంఛనంగా ప్రారంభించారు.

మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలాల విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ ను పూర్తి చేసే విజేతలను నియోజకవర్గం స్థాయి లో జరిగే పోటీలకు ఎంపిక చేస్తామని అధ్యాపకులు తెలిపారు.

క్యారమ్ పోటీల్లో సీనియర్ విభాగం లో ప్రథమ స్థానంలో బాలుర ఉన్నత పాఠశాల, ద్వితీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ద్వితీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉప్పలపాడు) విద్యార్థులు విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు