కోవిడ్ పాజిటివ్ కేసు ఇంటిని సందర్శించిన మండల టాస్క్ఫోర్స్ బృందం
పొదిలి పట్టణం చాలా కాలం తర్వాత కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు అయినా ఇంటిని మండల టాస్క్ఫోర్స్ బృందం సందర్శించింది.
ఆదివారం నాడు స్థానిక మాయాబజార్ విధి నందు కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు అయినా ఇంటిని పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్, మండల ప్రభుత్వం వైద్య అధికారిణి డాక్టర్ షేక్ షాహిదా బృందం సందర్శించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో తమను సంప్రదించాలని సూచించారు.
ఈ బృందంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిలారి సుబ్బారావు, వైద్యశాఖ సిబ్బంది నారు శ్రీనివాసులురెడ్డి, గ్రామ రెవెన్యూ అధికారి నారాయణ తదితరులు పాల్గొన్నారు