అంబేద్కర్ జయంతి సెలవరోజున ప్రైవేటు విద్యా సంస్థలు పాఠశాలలు నిర్వహణ
కలెక్టర్ ఆదేశాలు తో పాఠశాలలు తనిఖీ చేసిన ఎంఇఓ
రెండుపూటలు పాఠశాలలు నిర్వహణ పై ఎంఇఓ తనిఖీ చేసి నోటీసులు జారీ చేసిన లెక్క చేయని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యలు
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.. బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి సెలవదినం అయిన పొదిలి లోని 13 ప్రైవేటు పాఠశాలలో ఒకటి మినహా మిగతా 12 విద్యా సంస్థలు పాఠశాలలు నిర్వహించటంపై మీడియా సిబ్బంది జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు పొదిలి మండల విద్యాశాఖ అధికారి రాఘరామయ్య పాఠశాలలు తనిఖీ చేసి12 పాఠశాలలు పై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులుకు పంపించారు అదేవిధంగా గత వారంరోజుల క్రితం రెండు పూటలు పాఠశాలలు నిర్వహించాటంపై తనిఖీ చేసి వారికి నోటీసులు జారీ చేసిన లెక్క చేయకుండా రెండు పూటలు పాఠశాలలు నిర్వహింస్తున్నారు సెలవదినం అయిన లెక్క చేయకుండా పాఠశాలలు నిర్వహించాటంపై ప్రజాసంఘలు ఆందోళన వ్యక్తంచేస్తున్నయి ప్రధానంగా గీతంజలి ఆక్స్ ఫోర్డ్ విశ్వశాంతి విద్యా సంస్థలు నిబంధనలు తిలోకలుఇస్తు ఇష్టం రాజ్యంగా వ్యవరించాటంతో మిగత విద్యా సంస్థలు కూడా వారి బాటలో నడుస్తూ ప్రభుత్వం నియ నిబంధనలు తుంగలో తొక్కుతున్నరు కలెక్టర్ ఆదేశాలు మేరకు మండల విద్యా శాఖ అధికారి తనిఖీ చేసి పంపిన నివేదిక పై చర్యలు తీసుకొంటారో లేదో వేచి చూడవలసిందే