ముఖ్యమంత్రిని కలిసిన మున్సిపల్ కమిషనర్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
స్వచ్చ అమృత్ మహోత్సవ్ కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ – 2022లో వివిధ కేటగిరీ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11 అవార్డులు గెలుచుకుంది
అందులో భాగంగా శుక్రవారం నాడు
అవార్డు గ్రహీత కార్పొరేషన్, మున్సిపల్,నగర పంచాయితీ లకు చెందిన మేయర్లు కమీషనర్లు, మున్సిపల్ చైర్మన్లు కమీషనర్లు తోపాటు పొదిలి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి కలిసారు.
ఈ సందర్భంగా పొదిలి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ మున్సిపల్ అభివృద్ధి కోసం తయారు చేసిన సంపూర్ణ సమాచారం నివేదికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్ళగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు కమిషనర్ డానియల్ జోసప్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిములపు సురేష్, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కార్యదర్శి శ్రీలక్ష్మి,మున్సిపల్ శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు