సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలు ముట్టడి కార్యక్రమంలో భాగంగా పొదిలి మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం నాడు నగర పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు ముట్టడి చేసి ఉద్యోగులను కార్యాలయం నందు కార్యకలాపాలు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్ల తక్షణమే పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒప్పంద కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు