నగర పంచాయతీ కేసు వాయిదా

పొదిలి నగర పంచాయతీకి సంబంధించిన కేసు హైకోర్టులో మరోసారి వాయిదా పడింది.

వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయతీ పరిధి నుండి కంభాలపాడు, నందిపాలెం, మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ స్వీకరించిన హైకోర్టు ద్విసభ్య బెంచ్ బుధవారంనాడు విచారణ అనంతరం 14రోజుల పాటు వాయిదా వేసింది.

తదుపరి విచారణ మార్చి 17న జరగనుంది.