అనుమతి‌ లేని నిర్మాణాలు అడ్డుకున్న నగర పంచాయితీ సిబ్బంది

కమీషనర్ ను అడ్డుకున్న గృహ యజమాని బంధువులు

పోలీసులకు సమాచారం అందించిన కమీషనర్

 సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో రంగంలో దిగిన పోలీసులు

నిర్మాణాలను సీజ్ చేసిన నగర పంచాయితీ సిబ్బంది

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణం ఒంగోలు-కర్నూలు రోడ్డు నందు ప్లాన్ ఆమోదం లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ తన సిబ్బందితో సీజ్ చేసే సమయంలో గృహ యజమాని బంధువులు అడ్డుకోవటం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కమీషనర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన పొదిలి సిఐ సుధాకర్ రావు సంఘటన స్థలానికి చేరుకొని కమిషన్ అండగా నిలవటం తో నగర పంచాయితీ సిబ్బంది నిర్మాణాలను సీజ్ సామాగ్రిని నగర పంచాయితీ కార్యాలయానికి తరలించారు.

తీవ్ర ఉత్కంఠ మద్యలో పోలీసుల రంగం ప్రవేశంతో సమస్య పోలీసు స్టేషన్ కు చేరింది

ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, సిఐ సుధాకర్ రావు, యస్ఐ శ్రీహరి, నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు , నగర పంచాయితీ , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు