త్వరలో నగర పంచాయతీగా పొదిలి : కుందూరు
పొదిలి గ్రామ పంచాయతీ త్వరలోనే నగర పంచాయతీ కానున్నదని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అన్నారు.
వివరాల్లోకి వెళితే సోమవారంనాడు పొదిలి పట్టణ పర్యటనలో భాగంగా శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిని పొదిలి నగర పంచాయతీ ఏర్పాటు విషయం గురించి పొదిలి టైమ్స్ ప్రతినిధి అడగగా ప్రాధాన్య క్రమంలో తొలుత కొన్ని నగర పంచాయతీ ఏర్పాటు చేశారని….. త్వరలోనే పొదిలి నగర పంచాయతీ ఫైలుపై ప్రాధాన్యత క్రమం ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు.