NAP పంప్ హౌస్ విద్యుత్ బకాయి 1.5 కోట్లు..విద్యుత్ సరఫరా నిలిపివేత
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
సాగర్ నీరు సరఫరా చేసే ఎన్ ఎం పి పంప్ హౌస్ విద్యుత్ బకాయిలు ఒక కోటి ఐదు లక్షల రూపాయలు ఉండటం తో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా ను తొలగించారు.
దాని తో సాగర్ నీటి సరఫరా నిలిచి పోయింది.
గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు కోటి రూపాయలు దాటి పోవటంతో విద్యుత్ అధికారులు సరఫరా ను నిలిపివేశారు.
అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న యన్ ఎం పి పంప్ హౌస్ ల విద్యుత్ సరఫరా ను కూడా నిలిపి వేశారు
తక్షణమే అధికారులు స్పందించి విద్యుత్ బకాయిలను చెల్లింపులు చేసి సాగర్ నీటి సరఫరా కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు