ఎన్ జి ఓ అసోసియేషన్ ర్యాలీ ప్రమాణస్వీకారం

ఆంద్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పొదిలి తాలూకా యూనిట్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా ఎన్ జి ఓ లు ర్యాలీగా వెళ్ళి ప్రమాణస్వీకారం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే ఆదివారం స్ధానిక రోడ్లు భవనముల అతిధి గృహం నుండి ఎన్ జి ఓ భవన్ వరకు ర్యాలీగా వెళ్ళి నూతన కమిటీ చేత జిల్లా నాయకులు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల తక్షణమే పరిష్కారం కోసం కృషి చేయాలని అదేవిధంగా మన న్యాయంగా మనకు రావలసిన హక్కులను సాధించే విధంగా పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కె శరత్ బాబు, జిల్లా కోశాధికారి ఆర్ సిహెచ్ కృష్ణా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఫిరోజ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి యం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.