పొదిలి పంచాయతీపై బిజెపి కన్ను…. వార్డుల వారిగా క్యాడర్ ను సిద్ధం చేస్తున్న సంఘ్ పరివార్
సామాజిక సమీకరణాలపై దృష్టి
వార్డుల కైవసం కోసం ప్రత్యేక కసరత్తు
పొదిలి మేజర్ పంచాయతీ కైవసం చేసుకొనేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఆ దిశలో భాగంగా సంఘ్ పరివార్ సభ్యులు పంచాయతీలోని వార్డుల వారిగా క్యెడర్ ను సమాయత్తం చేస్తూ చాపక్రింద నీరులా పని చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ సామాజిక సమీకరణాలు చేయడంలో ప్రత్యేక శైలి కలదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత పరిస్థితులలో పొదిలి మేజర్ పంచాయతీ కైవసం చేసుకొనేందుకు అనుసరించే హ్యహంపై ప్రత్యేక కసరత్తు చేస్తూ తదుపరి సామాజిక సమికరణాల నేపధ్యంలో కొన్ని వర్గాలతో జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం.
త్వరలో రాజ్యసభ సభ్యులు జివియల్ నరసింహరావు కొన్ని సామాజిక వర్గాల నాయకులుతో బేటీ తరువాత జరిగే చేరికల అనంతరం భారతీయ జనతా పార్టీ తదుపరి కార్యచరణ మొదలు పెడుతుందని….. అదేవిధంగా పట్టణంలోని ముస్లిం, హిందూ, ఓటు బ్యాంకు ఉన్న పంచాయతీ వార్డులను కైవసం చేసుకొనేందుకు ప్రత్యేక కసరత్తు చేసినట్లు సమాచారం. రిజర్వేషన్ల ఖరారు అనంతరం తమ కార్యాచరణలో వేగంగా దూసుకుని వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.
ఏదిఏమైనా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఎన్నికలు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకు అంచనా వేస్తున్నారు.