పొదిలికి సమ్మర్ స్టోరేజ్ మరియు బైపాస్ నిర్మిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు

పొదిలికి సమ్మర్ స్టోరేజ్ మరియు బైపాస్ నిర్మిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటించిన ఆయన మార్కాపురం బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ ఎన్నికలలో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పొదిలి ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మిస్తామని….. అలాగే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని నా దృష్టికి వచ్చింది దాని పరిష్కారం కోసం బైపాస్ నిర్మాణం కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.