పెద్ద చెరువు అలుగు ఆక్రమణదారుల పై కేసు నమోదు
పొదిలి పెద్ద చెఱువు అలుగు వాగు ఆక్రమణదారులపై కేసు నమోదు చేసినట్లుగా యస్ఐ సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు.
వివరాల్లోకి వెళ్లితే స్థానిక పెద్దచెఱువు అలుగువాగు పోరంబోకు భూమిని ఆదివారంరాత్రి ఆక్రమణకు పాల్పడిన మల్లెల శ్యామ్, గోపిరెడ్డి నాగార్జునరెడ్డి, బండి సుబ్బారెడ్డిలపై పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.