పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా ఒంగోలు పట్టణంలో జరిగిన గణతంత్ర ఉత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులు ఉత్తమ పురస్కారాలు అందజేశారు.
అందులో భాగంగా పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న వెంకటేశ్వర్లు, పొదిలి యస్ఐ గా పని చేస్తున్న వేమన పొదిలి ఏయస్ఐ సత్యనారాయణలు జిల్లా ఎస్పీ దామోదర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ పురస్కారాలను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్. తమీమ్ అన్సారీయా జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు