పొదిలి ఠాణా కు”అభయ్” వాహనం బహుకరించనున్న నేషనల్ హార్టికల్చర్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆరిజ్ అహమ్మద్
నేషనల్ హార్టికల్చర్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ డాక్టర్ మహమ్మద్ ఆరిజ్ అహమ్మద్ పొదిలి ఠాణాకు ద్విచక్ర వాహనాన్ని బహుకరించనున్నారు.
వివరాల్లోకి వెళితే ప్రకాశంజిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిద్దార్థ్ కౌషల్ మహిళల భద్రత కోసం సురక్షితంగా ఇంటికి చేరేందుకు ఏర్పాటు చేసిన “అభయ్”వాహనాలకు ప్రజలలో విశేష ఆదరణ లభించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి పట్టణానికి చెందిన నేషనల్ హార్టికల్చర్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ డాక్టర్ ఆరిజ్ అహమ్మద్ “లాల్ ఫౌండేషన్” తరుపున పొదిలి ఠాణాకు ఒక ద్విచక్ర వాహనాన్ని బహుకరిస్తామని ఆయన సోదరుడు ఆఖిబ్ అహమ్మద్ పొదిలి పోలీసు వలయపరిధి అధికారికి తెలియజేసినట్లు పొదిలి పోలీసు వలయపరిధి అధికారి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు.
మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకుని మహిళలను సురక్షితంగా ఇంటి వద్దకు చేర్చేందుకు ద్విచక్ర వాహనాన్ని బహుకరిస్తామని తెలపడం అభినందనీయమని…… “లాల్ ఫౌండేషన్” బహుకరిస్తున్న ఈ వాహనాన్ని మహిళలను జాగ్రత్తగా ఇంటివద్దకు చేర్చేందుకు ఉపయోగిస్తామని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్దార్థ్ కౌషల్ తెలిపినట్లు వలయపరిధి అధికారి శ్రీరామ్ తెలిపారు.