విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించిన పొదిలి పోలీసులు

పొదిలి యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో వ్యాసరచన వక్తృత్వ పోటీలను నిర్వహించారు.

స్థానిక వివేకానంద విద్యాసంస్థల నందు శనివారం నాడు పట్టణంలోని వివిధ విద్యా సంస్థల చెందిన విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా యస్ఐ శ్రీహరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ వారం రోజుల పాటు పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలను నిర్వహించడం జరిగిందని ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు మరికొన్ని కార్యక్రమాలను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వ్యాసరచన వక్తృత్వ పోటీల విజేతలకు యస్పీ మల్లికా గార్గ్ సమక్షంలో లేక వారి ఆదేశాల మేరకు తదుపరి బహుమతులను ప్రదానం చేస్తామని తెలిపారు

ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్, వివేకానంద విద్యా సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు