బాధిత రైతులకు నష్టం పరిహారం లో అన్యాయం పై ధర్నా

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల భాగస్వామ్యం లో నిర్మాణం చెప్పాట్టుతున్న నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైన్ లో అసైన్మేంట్ భూములు కోల్పోయిన రైతులకు నష్టం పరిహారం లో అన్యాయం చేస్తున్నరని సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్ నాయకత్వం గురువారం ఉదయం స్ధానిక తహాశీల్ధార్ కార్యలయం నందు రైతులతో కలసి ధర్నా చేసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధర కు నాలుగు రెట్లు నష్టం పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందిని అన్నారు మండల పరిషత్ అభివృద్ధి అధ్యక్షులు నరసింహరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎటువంటి ప్రచారం చేయకుండా రహస్యం గా రైతులు పిలిచి ఎటువంటి ధర చెప్పకుండా కొంత మంది నుండి సంతకాలు వేలిముద్రలు వేపించాటం అన్యాయంని ఆయన అన్నారు అనంతరం తహాశీల్ధార్ విద్యాసాగరడు కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో. చినరికట్ల పెదరికట్ల కంభాలపాడు రాజుపాలెం పొదిలి గ్రామలకు చెందిన రైతులు వెంకట నారాయణ ఏడుకొండలు శంకర్ తదితరులు పాల్గొన్నారు