వైయస్సార్ భీమా చేయటంలో రీజియన్ లో పొదిలి యస్బీఐ ప్రధమ స్థానంలో ఉంది: ఆర్ ఎం ఓ సుధాకర్

వైయస్సార్ భీమా పధకం అమలులో రీజియన్ లో ప్రధమ స్థానంలో ఉందని ఆర్ ఎం ఓ సుధాకర్ తెలిపారు.

వివరాల్లోకి వెళితే శనివారం నాడు పొదిలి స్టేట్ బ్యాంక్ ను ఆర్ఎమ్ఓ సుధాకర్ తనిఖీ చేసి బ్యాంక్ రికార్డులను పరిశీలించి ఖాతాదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు, వైఎస్సార్ భీమా ఫిబ్రవరి 15 కల్ల పూర్తిచేస్తామన్ని బ్యాంక్ లో వైఎస్సార్ భీమా కొసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

ఖాతాదారులకు మెరుగైన సౌకర్యం కొసం బిసి పాయింట్లు ఏర్పాటు చేసామని, 20 వేల లోపు లావాదేవీలకుబ్యాంక్ సందర్శించవలసిన పనిలేదని బిసి ఫాయింట్ల వద్ద లావాదేవీలు నిర్వహించుకొవచ్చని అందుకు ఎటువంటి ఛార్జ్ వసులుచేయబడదన్నారు.