ఒంటిపూట బడులులకు మంగళం పాడిన ప్రైవేటు పాఠశాలలు

చోద్యం చూస్తున్న విద్యాశాఖ

ఎండలో మాడిపోతున్న చిన్నారులు

ఎండలు తీవ్రత నానాటికీ పెరుగుతోంది పెద్దలే ఎండల తీవ్రతను తట్టుకునే పరిస్థితి లో లేరు అలాంటిది చిన్నారుల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు మాత్రం తెలియడం లేదు. ప్రభుత్వం మార్చి 12వ తే దీ నుంచి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అవి కేవలం ప్రభుత్వం పాఠశాలలకు మాత్రమే వర్తిస్తున్నాయి. పట్టణంలోని కార్పొరేట్‌ పాఠశాలలు ఆ ఆదేశాలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎండలైతే మాకేంటని రెండు పూటలా ఎంచక్కా బడులు నడుపుతున్నా రు. పొదిలి పట్టణంలో పలు పాఠశాలలు ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నా విద్యాశాఖ మాత్రం చోద్యం చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇబ్బంది పడుతున్న చిన్నారులు… రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతోంది. చిన్నారులను ఎండల్లో తిరగవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ నగరంలోని కార్పొరేట్‌ పాఠశాలల తీరు మాత్రం మారడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేయకుండా రెండు పూటలా బడులు నడిపిస్తున్నారు. దీంతో చిన్నారులు ఉక్కపోతలో పాఠాలు వినాల్సిన దుస్థితి నెలకొంది. అసలే అపార్టుమెంట్లలోని ఇరుకు తరగతి గదులు, గాలి సైతం సరిగా రాని పరిసరాలు. దీంతో చిన్నారులు సాయంత్రం ఇంటికి చేరే సరికి వాలిపోతున్నారు.

చోద్యం చూస్తున్న అధికారులు…
ప్రధానంగా విశ్వనాథపురంలో ఉన్న ఒక్క ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వలనే మిగతా విద్యాసంస్ధలు కూడా రెండు పూటలు తరగతులు నిర్వహింస్తున్నాయిని విమర్శలు ఉన్నాయి  మండల విద్యాశాఖాధికారి పర్యవేక్షించి ప్రభుత్వ ఆదేశాలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. కానీ అ లాంటి సంఘటనలు మండలం లో జరిగిన దాఖలాలు లేవు. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.