పొదిలి శివాలయం రక్షణ ఏర్పాట్లు సంతృప్తికరం జిల్లా అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరి వెల్లడి

పొదిలి శివాలయం రక్షణ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరి అన్నారు.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ డిజిపి మరియు జిల్లా యస్పీ ఆదేశాల మేరకు  మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలోని పలు దేవాలయాల్లో రక్షణ ఏర్పాట్లు మరియు శాంతి కమిటీలు పరిశీలించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గ్రంథి మాధవితో కలిసి పరిశీలించామని పొదిలి శివాలయం రక్షణ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి ఆమె అన్నారు.

తొలుత శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దేవస్థానం ప్రాంగణం మొత్తం తిరిగి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గ్రంథి మాధవి, ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్ మరియు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.