ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంసెట్లో ఫలితాల్లో పొదిలి విద్యార్థి ప్రతిభ
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో నిర్వహించిన ఎంసెట్ పరీక్షల్లో పొదిలి నగర పంచాయతీ చెందిన విద్యార్థి ప్రతిభ చూపించారు.
వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన కోగర వెంకట నరసింహ సాయి జయదీప్ హర్ష యాదవ్ కు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాష్ట్రస్థాయి ఫలితాలలో 72వ ర్యాంకు సాధించగా తెలంగాణ ఎంసెట్ ఫలితాలు 66వ ర్యాంకు సాధించారు.
తల్లిదండ్రులు కోగర నరసింహారావు, కాంచన లు ఇరువురు ప్రభుత్వం ఉపాధ్యాయులు కావటంతో సరైన ప్రణాళికతో ముందుకు సాగడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఎంసెట్ ఫలితాలలో 100 ర్యాంకు లోపు ర్యాంకు సాధించారు .
పట్టణంలో పలువురు అభినందించారు