పొదిలి ఠాణాకు అభయ్ స్కూటీని బహుమతిగా అందజేసిన లాల్ ఫౌండేషన్

పొదిలి పోలీసు ఠాణాకు మహిళా భద్రత కొరకు లాల్ ఫౌండేషన్ సభ్యులు ఆఖిబ్ అహమ్మద్ అభయ్ స్కూటీని అందజేశారు.వివరాల్లోకి వెళితే మహిళా భద్రత కొరకు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిద్ధార్థ్ కౌశల్ అభయ్ వాహనాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నేపథ్యంలో పొదిలికి చెందిన నేషనల్ హార్టికల్చర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ ఆరిజ్ అహమ్మద్ ఐఏఎస్ “లాల్ ఫౌండేషన్” ద్వారా తన సొంత ఊరి పోలీసు ఠాణాకు అభయ్ స్కూటీని బుధవారంనాడు బహుకరించగా లాల్ ఫౌండేషన్ సభ్యులు ఆఖిబ్ అహమ్మద్ పొదిలి ఠాణాకు కు స్కూటీని అందజేయగా పొదిలి సిఐ శ్రీరామ్ స్కూటీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిఐ శ్రీరామ్ మాట్లాడుతూ మహిళల భద్రత కొరకు ఆపద సమయంలో సురక్షితంగా వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఈ వాహనాన్ని వినియోగిస్తామని ఆయన తెలిపారు తన సొంత ఊరికి తనవంతు సహాయం అందజేస్తున్న డాక్టర్ మొహమ్మద్ ఆరిజ్ అహమ్మద్ ఐఏఎస్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్ఐ సురేష్, గొలమారి చెన్నారెడ్డి, కల్లం సుబ్బారెడ్డి, జి శ్రీను, సత్యం, యాసిన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.