58 లక్షలతో తహాశీల్ధార్ నూతన భవనం నిర్మాణం
అన్ లైన్ టెండర్ పిలిచిన అధికారులు !
10 రోజుల లో తాత్కలిక భవనం లోనికి మారనున్న కార్యలయం !!
తాత్కలిక భవనం కోసం వెతుకుతున్న రెవిన్యూ అధికారులు !!!
ఉగాది రోజున భూమి పూజ తో పనులు ప్రారంభం
పొదిలి మండల రెవెన్యూ తహాశీల్ధార్ నూతన కార్యలయం నిర్మాణం కోరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 58 లక్షల రూపాయలు కేటాయించాటంతో రెవెన్యూ అధికారులు నూతన భవనం నిర్మాణం కోరకు అన్ లైన్ లో టెండర్ పిలవటం పొదిలి చెందిన కాంట్రాక్టర్ తూము బాలిరెడ్డి టెండర్ దక్కించుకోవటం జరిగింది. టెండర్ ప్రక్రియ పూర్తి కావటం తో పొదిలి రెవెన్యూ తహాశీల్ధార్ కార్యలయం సిబ్బంది నూతన తాత్కాలిక భవనం కోసం వెతుకులట ప్రారంభించారు అందులో భాగం చిన్న బస్టాండ్ ప్రాంతంలో రెండు భవనలు విశ్వనాథపురం ప్రాంతంలో ఒక్క భవనం అదే విధంగా పొదిలి పోలీస్ స్టేషన్ దగ్గర గల పాత స్టేట్ బ్యాంకు అప్ ఇండీయా భవనం తదితర భవనాలు అధికారులు పరిశీలించారు వీటిలో చిన్న బస్టాండ్ లోని ఒక్క భవనం మరియు పాత స్టేట్ బ్యాంకు అప్ ఇండియా భవనలలో ఏదో ఒక్కదానిలో ఉగాది నుండి కార్యకల్పలు మొదలు పెట్టలని అధికారులు నిర్ణయంనికి వచ్చారు.అదేవిధంగా గుత్తేదారడు ఉగాది రోజున భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించాలని ఆలోచన లో ఉన్నారు 100 సంవత్సరాలు పైగా చరిత్ర కల్గిన పొదిలి తహాశీల్ధార్ కార్యలయం నెలమట్టంకానున్న నైపద్యం పొదిలి ప్రజలు ఒక్కరకంమైన ఆవేదన కు గురిఅవుతున్నరు ఏదైనా అవకాశం ఉంటే ఇలాంటి పురాతన కట్టడలు నేలమట్టం చేయకుండా మరో మార్గం ఆలోచన చేయలని ప్రజలు కోరుతున్నరు