పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 … ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రమణారెడ్డి
పొదిలి టైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా బాదం రమణారెడ్డిని ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రెవేటు లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.
పొదిలి టైమ్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పొదిలి మండలంలో గత 10సంవత్సరాల నుండి సాంప్రదాయ వ్యవసాయంలో నూతన పనిముట్ల ద్వారా సేద్యం డ్రిప్ ద్వారా తక్కువ నీటి వనరుల వాడకం….. అలాగే మండలంలోని ఇతర రైతులకు ఆదర్శంగా ఉండడంతో ప్రజల మన్ననలు చొరగొన్నారు.
ఆయన వ్యవసాయ విధానాలు ఇతర రైతులకు స్పూర్తిగా ఉండడంతో ఉత్తమ రైతు అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.