పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 … ఉత్తమ మార్గదర్శకులు అవార్డు గ్రహీత నాసర్

పొదిలి టైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ మార్గదర్శకులు అవార్డు గ్రహీతగా షేక్ నాసర్ అహ్మమద్ ను ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.

పొదిలి టైమ్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పొదిలి పట్టణంలో గత ఇరవైసంవత్సరాల నుండి ఉపాధ్యాయులుగా ఉత్తమ సేవలు అందిస్తూ పట్టణంలో ఉత్తమ క్రికెట్ క్రీడకారుడుగా సేవాలందించి మరెంతోమందికి క్రీడల నందు సలహాలు అందింస్తుండడంతో పాటు అత్యంత కీలకమైన అంశమైన పోటీ పరీక్షల గ్రంథాలయానికి శ్రీకారం చుట్టి ఇటీవల జరిగిన గ్రామ సచివాలయం ఎంపిక పరీక్షల్లో 8మంది ఎంపిక అవడంలో కీలకంగా వ్యవహరించి అందరికీ మార్గదార్శుకులుగా ఉండడంతో ప్రజల మన్ననలు చొరగొన్నారు.

ఆయన సేవలను గుర్తిస్తూ ఉత్తమ మార్గదర్శకులు అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.