పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019…ఉత్తమ సేవా సంఘం అవార్డు గ్రహీత అమ్మ సేవా సంఘం
పొదిలి టైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ సేవా సంఘం అవార్డు గ్రహీతగా అమ్మ సేవా సంఘాన్ని ఎంపిక చేసి అధ్యక్షులు సయ్యద్ ఇమాంసాకు టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.
పొదిలి టైమ్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పొదిలి పట్టణంలో ప్రాధమిక చికిత్సా కేంద్రం నిర్వహిస్తూ ఐదు సంవత్సరాల పాటు మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా పనిచేసి గత నాలుగు సంవత్సరాల నుండి అమ్మ సేవా సంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజల మన్ననలు చొరగొన్నారు.
అమ్మ సేవా సంఘం ద్వారా ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఉత్తమ సేవా సంఘం అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఘనంగా సత్కరించారు.