పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 … ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు గ్రహీత రామిరెడ్డి

పొదిలి టైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు గ్రహీతగా తిమ్మారెడ్డి వెంకట రామిరెడ్డిని ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.

పొదిలి టైమ్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పలు వ్యాపారాలలో తన ప్రతిభ సామర్ధ్యాన్ని ఉపయోగించి నూతనంగా వ్యాపారం ప్రారంభించే వారికి స్ఫూర్తిగా నిలిచిన ఆయన వ్యాపార మెళుకువలను గుర్తించి ఉత్తమ వ్యాపారవేత్త అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా యాజమాన్యం ఘనంగా సత్కరించారు.