రిపబ్లిక్ టివి ఎడిటర్ అర్నబ్ గోస్వామి పై దాడిని ఖండించిన పొదిలి టైమ్స్
రిపబ్లిక్ టివి ఎడిటర్ అర్నబ్ గోస్వామి పై గత అర్థరాత్రి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడి పట్ల పొదిలిటైమ్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా వ్యవరిస్తున్న మీడియాపై దాడి పిరికిపంద చర్య అని అత్యంత కిరాతకంగా హత్యగావించబడ్డ సాధువులు గురించి కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించినందుకు గాను ఆ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా కేసులు పెట్టడడమే కాకుండా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అర్నబ్ గోస్వామిపై దాడి చేయడం దేనికి సంకేతమని…… ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఈ చర్య మీడియా పై గొడ్డలి పోటులాంటిదని ఇలాంటి చర్యలను పొదిలిటైమ్స్ తీవ్రంగా ఖండిస్తుందని పొదిలిటైమ్స్ యాజమాన్యం తెలిపింది.