పొదిలి సమితి శాఖ అధ్యక్షులుగా నాగర్ వలి
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది సంఘం పొదిలి తాలుకా శాఖ అధ్యక్షులుగా షేక్ నాగుర్ వలి , ఉపాధ్యక్షులుగా షేక్ ఎండి రఫీ, కార్యదర్శిగా షేక్ గౌసియా బేగం, సంయుక్త కార్యదర్శిగా ఐ శ్రీలక్ష్మి, కోశాధికారిగా షేక్ సందాని భాష, జిల్లా కౌన్సిలర్లుగా కె రాంబాబు, షేక్ జిందేషా మదార్ వలిలతో కూడిన నూతన కమిటీ శనివారం నాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్ బాలకృష్ణ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు.