జాతీయ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న పొదిలి వాసి
జాతీయ ఉత్తమ సేవా పురస్కారాన్ని పొదిలి పట్టణం చెందిన దరిశి శివాజీ అందుకున్నారు.
వివరాల్లోకి వెళితే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ ప్రధమ వార్షికోత్సవ సందర్భంగా నెల్లూరు నందు జరిగిన సమావేశంలో విశ్వంభర జాతీయ ఉత్తమ సేవా పురస్కారం (పారంపర్య వైద్యం) అవార్డును ట్రస్ట్ చైర్మన్ చైర్మన్ హెచ్ ఇ తాళ్ళూరి సువర్ణ కుమారి చేతుల మీదుగా పొదిలి పట్టణం చెందిన వంశపారంపర్య వైద్యులు దరిశి శివాజీ అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో వంశపారంపర్య వైద్యులు సత్యనారాయణ, నందముని, నాగ కుమార్, ఆయూబ్ , శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు