పొదిలి మండలం మంచి నీటి సమస్య పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ కు జడ్పీటిసి సాయి వినతి

పొదిలి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వర్షాలు పడినప్పటికీ పొదిలి మండలం లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవటంతో బోర్లల్లో కూడా నీరు అందుబాటులో లేకుండా పోయిందని దినికి తోడు ట్యాంకర్లు సంఖ్యను తగ్గించడం వలన నీటి ఎద్దడి తీవ్రమై ప్రజలు తరచూ రాస్తారోకోలు ధర్నాలు చేయుచున్నారని పొదిలి మండలం లోని అన్ని గ్రామపంచాయతి లలో గల  నీటి సమస్యను జిల్లా కలెక్టర్ కు  వివరించి ట్యాంకర్ల సంఖ్యను పెంచవలసినదిగా వినతి పత్రం అందచేశారు.అందుకు స్పందించిన కలెక్టర్ ట్యాంకర్లు సంఖ్యను పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చినట్లు జడ్పీటీసీ పొదిలి టైమ్స్ ప్రతినిధికి తెలియజేశారు