పొదిలి యువకుడు మధ్యప్రదేశ్ లో అనుమానస్పద మృతి
పొదిలి మండలం మల్లవరం గ్రామానికి చెందిన యువకుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పొదిలి మండలం మల్లవరం గ్రామానికి చెందిన తల్లారి జాన్ వెస్లీ(25) యువకుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ నందు ఐబిపియస్ బ్యాంకు పరీక్షలు వ్రాసే నిమిత్తం విజయవాడ నుంచి రైలు బైలుదేరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ రైల్వేస్టేషన్ వద్ద చేరగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మల్లవరం గ్రామానికి తీసుకొని వచ్చి ఆదివారం నాడు అంత్యక్రియలు నిర్వహించారని సమాచారం.
మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే పోలీసు స్టేషన్ నందు అనుమానాస్ప మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.