నరసింహస్వామి, శివాలయం దేవస్థానాల కమిటీలకు నోటిఫికేషన్ జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదవుల పందేరం మొదలుపెట్టింది.అందులో భాగంగా తొలుత రాష్ట్రవ్యాప్తంగా దేవదాయశాఖ పరిధిలోని దేవస్థానాలకు నోటిఫికేషన్లు జారీ చేయగా అందులో జిల్లా వ్యాప్తంగా 124దేవస్థానాల్లో పొదిలి మండలంలోని పృథులగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మరియు శివాలయం దేవస్థానాలకు కూడా నోటిఫికేషన్ జారీ చేశారు.

దరఖాస్తుదారులు అర్హత 35సంవత్సరాలు పైబడి…. భారతీయ పౌరుడై ఉండాలి….. హిందుమతాన్ని ఆచరింస్తూ ధూమపానం, మద్యపానం వంటి చెడులక్షణాలు ఉండకూడదు అనే నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకోవాలని….. ఈ నెల 19వ తేదీలోగా అసిస్టెంట్ కమిషనర్ ఒంగోలు వారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.