పొదిలిటైమ్స్ అవార్డ్స్-2023 … ఉత్తమ ప్రాధమిక చికిత్స కేంద్రం అవార్డు గ్రహీత లక్ష్మి నారాయణ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి టైమ్స్ అవార్డ్స్-2023 ఉత్తమ ప్రాధమిక చికిత్స కేంద్రం అవార్డు గ్రహీతగా కొనిజేటి లక్ష్మీ నారాయణని ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.
పొదిలి టైమ్స్ 6వ వార్షికోత్సవం సందర్భంగా స్ధానిక ఓబులుశెట్టి వారి వీధి నందు లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో 25 సంవత్సరాల నుండి ప్రాధమిక చికిత్స కేంద్రం నడుపుతూ అత్యవసర పరిస్థితిలో అలాగే సాధారణ పరిస్థితిలో ప్రాధమిక చికిత్స అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు చొరగొన్నారు.
ఆయన సేవలను గుర్తిస్తూ ఉత్తమ ప్రాధమిక చికిత్స కేంద్రం అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్, సబ్ ఎడిటర్ షేక్ మస్తాన్ , వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు