పొదిలిటైమ్స్ అవార్డ్స్-2023…ఉత్తమ సేవా సంఘం అవార్డు గ్రహీత లాల్ ఫౌండేషన్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి టైమ్స్ అవార్డ్స్-2023 ఉత్తమ సేవా సంఘం అవార్డు గ్రహీతగా లాల్ ఫౌండేషన్ ఎంపిక చేసి ఛైర్మన్ అఖిబ్ అహ్మద్ కు టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.

పొదిలి టైమ్స్ 6వ వార్షికోత్సవం సందర్భంగా పొదిలి పట్టణంలో గత ఐదు సంవత్సరాలుగా లాల్ ఫౌండేషన్ ద్వారా నిత్య అన్నదాన కార్యక్రమం మరియు కోవిడ్ పట్టణంలో నిత్యవసర వస్తువులు పంపిణీ తోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజల మన్ననలు చొరగొన్నారు.

లాల్ ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఉత్తమ సేవా సంఘం అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్, సబ్ ఎడిటర్ షేక్ మస్తాన్ , వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు