పొదిలిటైమ్స్ అవార్డ్స్-2023….. ఉత్తమ విద్యార్థి అవార్డు గ్రహీత పల్లవి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలిటైమ్స్ అవార్డ్స్-2023 ఉత్తమ విద్యార్థి అవార్డు గ్రహీతగా పల్లవి ను ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.
పొదిలి టైమ్స్ 6వ వార్షికోత్సవం సందర్భంగా మాన్ కి బాత్ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ఆన్లైన్ ద్వారా చక్కని హిందిలో మాట్లాడి ప్రధాన మంత్రి మన్ననలు పొందిన పల్లవి కి అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రవేటు లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్, సబ్ ఎడిటర్ షేక్ మస్తాన్ , వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు