పొదిలిటైమ్స్ అవార్డ్స్-2023 … ఉత్తమ యువజన సంఘం గ్రహీత

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి టైమ్స్ అవార్డ్స్-2023  ఉత్తమ ప్రత్యేక అవార్డు గ్రహీతలుగా ప్రెండ్స్ యావర్ టీం సభ్యులు షేక్ షకీర్, షేక్ జిలానీ, కోగర సుబ్రహ్మణ్యం, షేక్ రఫీ, ముల్లా మదర్ వలి,(హన్ను) షేక్ ఖలీల్, షేక్ రబ్బానీ, పఠాన్ రబ్బానీ, షేక్ గౌస్, షేక్ బాషా (నన్నా), ముల్లా షాహిద్ ను ఎంపికచేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.

పొదిలి టైమ్స్ 6వ వార్షికోత్సవం సందర్భంగా పొదిలి పట్టణంలో నందు  గత కోవిడ్ సమయంలో కోవిడ్ తో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించి ప్రజల మన్ననలు చొరగొన్నారు.

షేక్ షకీర్ నాయకత్వంలోని బృందం చేసిన
సేవలను గుర్తిస్తూ ఉత్తమ ప్రత్యేక అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు

ఈ కార్యక్రమంలో పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్, సబ్ ఎడిటర్ షేక్ మస్తాన్ , వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు