పొదిలిటైమ్స్ అవార్డ్స్-2023 … ఉత్తమ ప్రజా ప్రతినిధి అవార్డు గ్రహీత శ్రీనివాస్ యాదవ్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి టైమ్స్ అవార్డ్స్-2023 ఉత్తమ ప్రజా ప్రతినిధి అవార్డు గ్రహీతగా ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ చిరుమళ్ళ శ్రీనివాస్ యాదవ్ ను ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.
ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ చిరుమళ్ళ శ్రీనివాస్ పంచాయతీ పరిధిలో విశేష సేవలను అందించి ప్రజల మన్ననలు చొరగొన్నారు.
ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఉత్తమ ప్రజా ప్రతినిధి అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్, సబ్ ఎడిటర్ షేక్ మస్తాన్ వలీ, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు