పోలీసుల పై దురుసుగా వ్యహరించిన మందుబాబులు అరెస్ట్

పొదిలి చిన్న బస్టాండ్ నందు శనివారం సాయంత్రం ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా తనిఖీకి సహకరించకుండా పోలీసులపై దురుసుగా వ్యవహరించిన దరిశి మండలం జముకులదిన్నె గ్రామానికి చెందిన మాగం సుబ్బారావు(34) కొస్టాలు గ్రామానికి చెందిన చేరెడ్డి శ్రీను(45) అనే ఇరువురు మందుబాబులను అరెస్టు చేసినట్లు స్ధానిక పొదిలి పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొదిలి యస్ఐ నాగరాజు తెలిపారు.వారిని న్యాయమూర్తి వద్ద హాజరుపరచనున్నట్లు తెలిపారు.