మట్కా శిబిరం పై పోలీసులు దాడి 10 మంది అరెస్టు: ఠాణా అధికారి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణంలోని పీర్ల చావిడి వద్ద మట్కా శిబిరం పై దాడి చేసి 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 5550 రూపాయలు నగదు , డబుల్ డిజిట్ కల్గిన ఐదు స్లిప్ లను స్వాధీనం చేసుకున్నట్లు పొదిలి ఠాణా అధికారి కొమర మల్లిఖార్జునరావు గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
పొదిలి మండలం పరిధిలో జాదం ఆడే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఉక్కుపాదం మోపుతామని పొదిలి ఠాణా అధికారి కొమర మల్లిఖార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు