ప్రత్యేక తనిఖీల్లో 36ద్విచక్ర ఒక త్రిచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్న రక్షకభటులు
పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 36ద్విచక్ర ఒక త్రిచక్ర వాహనాన్ని రక్షకభటులు స్వాధీనం చేసుకున్న సంఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో తెల్లవారుజామున 5గంటల నుండి 7గంటల వరకు దర్శి సబ్ డివిజనల్ పోలీసు అధికారి అధికారి ప్రకాశ్ రావు నేతృత్వంలో పిచ్చిరెడ్డి కాలనీ, టైలర్స్ కాలనీలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా సరైన పత్రాలులేని 36ద్విచక్ర వాహనాలను ఒక త్రిచక్ర వాహనన్ని గుర్తించినట్లు డీఎస్పీ ప్రకాష్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు లేక వాహనాలు సంచరిస్తున్నట్లయితే అటువంటి సమాచారాన్ని పోలీసువారికి తెలియజేయాలని ఆయన కోరారు.
దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు పొదిలి ఠాణా అధికారి కె సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక తనిఖీలలో దర్శి సబ్ డివిజన్ పరిధిలోని 12మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.