పేకాట శిబిరం పై పోలీసులు దాడి 10 మంది అరెస్టు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి మున్సిపల్ పరిధిలోని రాజుపాలెం పొలాల్లో పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు పేకాట శిబిరం పై దాడి చేసి 10 మందిని అరెస్టు చేసి 55,880 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కోటయ్య తెలిపారు.

ఈ సందర్భంగా యస్ఐ కోటయ్య మీడియాతో మాట్లాడుతూ పేకాట కోడి పందాలు నిర్వహించే వారి వివరాలు అందిస్తే వారి వివరాలు తెలియకుండా అట్టివారి పై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఈ దాడిలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు