పోలీసువలయంలో గ్రామ పంచాయతీ సమావేశం
తిరస్కరించిన రెండున్నర కోట్లు అభివృద్ధి పనులు
వర్క్స్ కమిటీ మినిట్స్ బుక్ చూపించాలని పంచాయతీ సభ్యులు పట్టు
వచ్చే సమావేశం చూపిస్తా నన్న సర్పంచ్
సర్పంచ్ వైఖరికి నిరసనగా దీక్ష చేపట్టిన పంచాయతీ సభ్యులు
పొదిలి గ్రామ పంచాయతీ సమావేశం పోలీసుల వలయంలో నిర్వహించారు పొదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగవరపు దీప అధ్యక్షుతనతో సమావేశం ప్రారంభంకాగా రెండున్నర కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన 21 అంశాలను గ్రామ పంచాయతీ సమావేశంలో మెజారిటీ సభ్యులు తిరస్కరించారు పంచాయతీ సభ్యులు షేక్ ఛోటా ఖాసిం ముల్లా ఖాదర్ భాషలు అక్రమంగా వర్క్ స్ కమిటీ తీర్మానలు చేసారని కాబట్టి వర్క్స్ కమిటీ మినిట్స్ బుక్ చూపించాలని పట్టుబట్టంతో సమావేశం గందరగోళం అయ్యింది దానికి స్వదించిన సర్పంచ్ వచ్చే సమావేశంలో చూపిస్తామని తెలిపారు సర్పంచ్ వివరణకు సభ్యులు అభ్యంతరం తెలిపి తక్షణమే మినిట్స్ బుక్ చూపించాలని పట్టుబట్టరు అయనా పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు సర్పంచ్ గంగవరపు దీపలు స్వందిచాలేదు దానితో పంచాయతీ సభ్యులు సమావేశం ముగిసిన వెంటనే మండల పరిషత్ కార్యలయంకు వెళ్లి అక్కడ ఈఓఆర్డి పిర్యాదు చేద్దామని వెళితే ఈఓఆర్డి అందుబాటులో లేకపోవడం తో చారవాణి ద్వారా జిల్లా పంచాయతీ అధికారికి పిర్యాదు చేశారు దానితో అధికారుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో పొదిలి గ్రామ పంచాయతీ కార్యలయం వద్దకు వచ్చి పంచాయతీ సభ్యులు దీక్ష దిగారు ఈ సందర్భంగా పంచాయతీ సభ్యులు ఛోటా ఖాసిం మాట్లాడుతూ 2016-17 సంవత్సరం మంచి నీరు తొలిని ట్యాంకర్ యజమానులకు బిల్లు చెల్లించాలని అభివృద్ధి పనులు లో జరిగిన అక్రమాలపై సర్పంచ్ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నమని మా డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగుతుందని అయిన అన్నారు ఈ దీక్ష లో ఉప సర్పంచ్ షేక్ ఖాసిబీ పంచాయతీ సభ్యులు ముల్లా ఖాదర్ భాష ఛోటా ఖాసిం కంబాల రవి షేక్ నుర్జహాన్ కంచర్ల రమణమ్మ దేవరకొండ రమణమ్మ పులుకూరి అనోలా ఝాన్సీలు కూర్చున్నరు