చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన పొల్లా
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పట్ల అనిచిత వ్యాఖ్యల పట్ల ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ తీవ్రంగా ఖండిస్తూ శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
నిన్న అసెంబ్లీలో అవహేళన చేస్తూ మాట్లాడం దారుణం అని, ఇదీ యావత్తు మహిళా జాతికి జరిగిన అవమానం అని వైసీపీ ప్రజా ప్రతినిధుల ధోరణిని తీవ్రంగా ఖండించారు.
ఇప్పటికే కొంతమంది మంత్రులు, అధికారపార్టీ శాసనసభ్యులు ఎటువంటి బాష వాడుతోన్నారో, రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందని, వీర
మన ప్రజా ప్రతినిధులు అని ప్రజలు విసిగిపోతున్నారని, నిన్ను జరిగిన సంఘటన అసెంబ్లీ చరిత్రలో మాయని మచ్చగా నిలుస్తోందని, ఇప్పటికే ఎన్నోసార్లు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ను టీడీపీ క్యాడర్ ను ఎన్నో అవమానాలకు గురి చేస్తున్న మౌనంగా ఉన్నామని ఇంకా ఉపేక్షించేది లేదని అన్నారు.