తపాలా ఉద్యోగులు ధర్నా
తపాలా శాఖను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ పొదిలి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట బుధవారం తపాలా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా సందర్భంగా పలువురు ఉద్యోగులు సంఘం నాయకులు మాట్లాడుతూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖను ప్రైవేటీకరణ యోచన విరమించాలని అదే విధంగా
తపాల శాఖలోని ఉద్యోగుల జిడియస్ అలవెన్సులు, పెండింగ్ బోనస్ లు, అరియర్స్ మొదలైన డిమాండ్ల పరిష్కారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు ఎం శ్రీనివాసులు,డివి రమణయ్య, ఎం వెంకటేశ్వర్లు, రవిచంద్ర , యానాది,సిఐటియు నాయకులు రమేష్ మరియు తపాలా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు