పోతవరం గ్రామంలో పట్టపగలు చోరీ
పొదిలి మండలం పోతవరం గ్రామంలో మంగళవారంనాడు పట్టపగలే చోరీ జరగడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే మంగళవారం ఉదయం యన్ శ్రీను తను కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబం మొత్తం తమ నివాసం గృహానికి తాళం వేసి రాజంపల్లి వద్ద గల మూసి ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
అనంతరం తిరిగి ఇంటికి వచ్చి చూడగానే ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్ళి చూడగా ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి బీరువా కూడా తీసి ఉండడంతో…… బీరువాలో చూడగా బీరువాలో ఉండవలసిన 60వేలు నగదు 6సవార్ల బంగారం అపహరణకు గురయ్యాయని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న సిఐ చిన్న మీరాసాహెబ్, యస్ఐ శ్రీరామ్ లు సంఘటన స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.