ఉత్తమ తహశీల్దారుగా ప్రభాకరరావు
జిల్లాలో ఉత్తమ తహశీల్దారుగా ప్రభాకరరావు ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.
వివరాల్లోకి వెళితే గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని
బంగోలు పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కార సభలో జిల్లా ఉత్తమ తహశీల్దారు పురస్కారాన్ని పొదిలి మండల రెవిన్యూ తహశీల్దార్ జె ప్రభాకరరావు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
పొదిలి మండలంలో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అలాగే రెవిన్యూ శాఖను ప్రగతిపథంలో ముందుకు నడిపిస్తున్నందుకు గాను జిల్లాలో ఉత్తమ తహశీల్దారు పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా స్థాయి చెందిన వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.