పొదిలి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సిద్దార్థ్ కౌశల్

పొదిలి పోలీస్ స్టేషన్ ను జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ్ కౌశల్ తనిఖీ చేశారు.

వివరాల్లోకి వెళితే సోమవారంనాడు రాత్రి పొదిలి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిద్ధార్థ్ కౌశల్ రికార్డులను పరిశీలించి…. సిబ్బందితో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు…. స్టేషన్ సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్, ఎస్ఐ సురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.