జిల్లా ఎస్పీ చేతుల మీదుగా పోలీసు స్టేషన్ నందు పలు ప్రారంభోత్సవాలు
పొదిలి పోలీసు నందు ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిద్దార్థ్ కౌషల్ చేతుల మీదుగా పలు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పోలీసు స్టేషన్ నందు ఏర్పాటు నూతనంగా నిర్మించిన స్పందన రిసెప్షన్ కౌంటర్, జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ రూమ్, వెయిటింగ్ షెల్టర్, హాండ్ శానిటేషన్ పాయింట్లను జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌషల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సేవలను యథావిధిగా కొనసాగిస్తూ ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ పని సులభతరం చేసే విధంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్టేషన్ పొదిలి పోలీస్ స్టేషన్ అవ్వడం విశేషం అని……. అతి తక్కువ సమయంలో ఎంతో చక్కగా ఏర్పాట్లను చేయడం ఒక శుభపరిణామని అన్నారు.
అలాగే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ కరోనా వ్యాధి నిరోధానికి పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది ఎంతగానో కష్టపడుతున్నారని…. వారికి ప్రజలు సహకరించి అత్యవసర సమయాలలో మాత్రమే బయటికి రావాలని బయటికి వచ్చేటప్పుడు విధిగా మాస్కు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కరోనా మహమ్మారి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దరిశి డిఎస్పీ ప్రకాష్ రావు, పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్, పొదిలి ఎస్ఐ సురేష్, మర్రిపూడి ఎస్ఐ సుబ్బరాజు, తర్లుబాడు, దొనకొండ ఎస్ఐలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.